: 'జనతా గ్యారేజ్'లో జూనియర్ ఎన్టీఆర్ ను కలిసిన నితిన్


'అ...ఆ' సినిమా విజయోత్సాహంలో ఉన్న నితిన్.. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'జనతా గ్యారేజ్' సెట్లో సందడి చేశాడు. హైదరాబాదులో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్లిన నితిన్, అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ను కలిశాడు. ఈ సందర్భంగా సినిమాల గురించి ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ దిగిన ఫోటోను జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. కాగా, 'జనతా గ్యారేజ్' సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News