: ప్లాట్ ఫామ్ బఫర్ ను ఢీ కొట్టిన ‘గతిమాన్’ ఎక్స్ ప్రెస్


ఢిల్లీ - ఆగ్రాల మధ్య ఇటీవల ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ ‘గతిమాన్’ ప్లాట్ ఫామ్ బఫర్స్ ను ఢీకొట్టింది. రైలును రివర్స్ చేస్తుండగా డెడ్ ఎండ్ కు చేరిన సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిన్న ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్ లోని ఆరవ నంబర్ ప్లాట్ ఫామ్ పై ఉన్న ‘గతిమాన్’ను రివర్స్ చేస్తుండగా డెడ్ ఎండ్ లోని బఫర్ ను తాకింది. దీంతో, స్వల్ప నష్టం జరిగినట్లు రైల్వే అధికారి భూపేందర్ థిలాన్ చెప్పారు. ‘గతిమాన్’ కోచ్ లకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News