: పిడుగురాళ్లలో భూ ప్రకంపనలు... పరుగులు తీసిన ప్రజలు
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఈరోజు స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, గుంటూరు పొరుగు జిల్లా అయిన ‘ప్రకాశం’లో రెండు రోజుల క్రితం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే. జిల్లాలోని బలిజపాలెం, బొట్ల గూడూరు, ఇన్నిమెర్ల, పామూరు, కంభాలదిన్నెలో మూడు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది.