: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న అమిత్ షా.. కాసేపట్లో సూర్యాపేటలో బీజేపీ బహిరంగ సభ ప్రారంభం
కాసేపట్లో నల్గొండ జిల్లా సూర్యాపేటలో భారతీయ జనతా పార్టీ నిర్వహించతలపెట్టిన ‘వికాస్ పర్వ్’ బహిరంగ సభ ప్రారంభం కానుంది. దీనికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమిత్ షా పలువురు బీజేపీ నేతలతో కలసి నల్గొండకు బయలుదేరారు. తెలంగాణలో జరిగే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తాము విజయం సాధించి తీరుతామని బీజేపీ రాష్ట్ర నేతలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి నేడు నిర్వహించనున్న సభతో శ్రీకారం చుట్టనున్నామని చెప్పారు.