: ఆ ప్రతిభ నాకు లేదు.. అందుకే, వారితో రాయిస్తుంటాను: నటి విద్యాబాలన్
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ కు నటనపైన మాత్రమే కాదు, కథలపై కూడా ఆసక్తి ఉందట. తన మనసులోకి వచ్చిన ఆలోచనలను కథలుగా మార్చాలని అనుకునేదట. అయితే, రచనా రంగంలో ప్రావీణ్యం లేకపోవడంతో, తనకు సన్నిహితులైన రచయితలకు చెప్పి వారిచేత ఆ కథలను రాయించే ప్రయత్నం చేస్తుంటానని చెబుతోంది. తన వద్ద ఆలోచనలకు కొదవలేదని చెబుతున్న విద్యాబాలన్, సినిమాల్లో వచ్చిన అవకాశాలలో మంచి వాటిని ఎంచుకుని చేసేయటమే తన పని అని చెబుతోంది.