: సినీ, టీవీ నటీమణులతో ‘కెవ్ కబడ్డీ’ పోటీలు
తెలుగు సినీ, టీవీ నటీమణులు త్వరలో కబడ్డీ ఆడనున్నారు. సుమారు 35 మంది నటీమణులతో హైదరాబాద్ లో 'కెవ్ కబడ్డీ' పోటీలు నిర్వహించనున్నారు. విక్రం ఆర్ట్స్ ఆధ్వర్యంలోని శతాబ్ది టౌన్ షిప్ సమర్పణలో జులై 2వ వారంలో ఈ పోటీలు జరగనున్నట్లు శతాబ్ది టౌన్ షిప్ అధినేత శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తారలతో కబడ్డీ పోటీలు నిర్వహించాలనే ఆలోచన టీవీ డైరెక్టర్ విక్రమ్ ఆదిత్య దని, ఆయన ఈ విషయం చెప్పగానే తనకు చాలా కొత్తగా అనిపించిందన్నారు. ఈ కాన్సెప్ట్ నచ్చడంతో, ప్రజల్లో కూడా ఆదరణ లభిస్తుందన్న నమ్మకంతో కెవ్ కబడ్డీ కార్యక్రమాన్ని తాము స్పాన్సర్ చేస్తున్నామని చెప్పారు.