: అపోలోకు షాక్... కిడ్నీ రాకెట్ లో అపోలో వైద్యుడి పీఏ అరెస్ట్


దేశ రాజధాని ఢిల్లీలో కలలకం రేపిన కిడ్నీ రాకెట్ కు సంబంధించి దేశీయ ప్రైవేట్ వైద్య రంగంలో అగ్రగామిగా ఎదిగిన అపోలో హాస్పిటల్స్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన 12 మందిలో ఇద్దరు ఆపోలో ఆసుపత్రికి చెందిన సిబ్బంది ఉన్నారు. తాజాగా ఆపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యుడి పీఏను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో అరెస్టైన వారిలో ఆపోలో సిబ్బంది సంఖ్య మూడుకు చేరుకుంది. ఇక అపోలో ఆసుపత్రిపై వెల్లువెత్తిన ఆరోపణలతో ఆ సంస్థకు చెందిన ఐదు ఆసుపత్రుల్లో పోలీసులు ముమ్మర సోదాలు చేశారు. ఈ సోదాల అనంతరమే ఆ ఆసుపత్రి వైద్యుడి పీఏను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News