: నాదల్ కు మరో దెబ్బ... గాయం కారణంగా వింబుల్డన్ కు దూరమైన టెన్నిస్ స్టార్


వరల్డ్ టెన్నిస్ లో సత్తా చాటుతూ వస్తున్న రఫెల్ నాదల్ కు . ప్రస్తుతం పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదు. ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ లో భారీ ఆశలతో అడుగుపెట్టిన ఈ 30 ఏళ్ల యువ సంచలనం... గాయం కారణంగా రెండో రౌండ్ లోనే ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. తాజాగా త్వరలో జరగనున్న వింబుల్డన్ లోనూ ఈ 'మట్టి కోర్టు’ కింగ్ ఆటను మనం చూడలేం. ఎందుకంటే.. ఎడమ చేతి మణికట్టుకు అయిన గాయం కారణంగా అతడు అసలు వింబుల్డన్ టోర్నీలోనే అడుగుపెట్టడం లేదు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని స్వయంగా నాదలే తెలిపాడు. ఇప్పటికే రెండు సార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన నాదల్... ఫ్రెంచి ఓపెన్ లో అయిన గాయం కారణంగా మరింత విశ్రాంతి అవసరమన్న వైద్యుల సలహాతో వింబుల్డన్ టోర్నీలోకి అడుగుపెట్టలేకపోతున్నానని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News