: మంత్రి అయినా రైతు బిడ్డే!... ఒడి కట్టి విత్తనమేసిన పరిటాల సునీత!


నిజమే... పరిటాల సునీత ఏపీ కేబినెట్ కీలక శాఖకు మంత్రిగా ఉన్నా... తాను రైతు బిడ్డనన్న విషయాన్ని ఆమె మరిచిపోవడం లేదు. తన సొంత జిల్లా అనంతపురంలో పర్యటిస్తున్న సందర్భాల్లో ఆమె జిల్లా ప్రజలతో పాటు రైతులతో మమేకం అవుతున్నారు. ఈ క్రమంలో పలుమార్లు ఆమె పంటపొలాల్లో పనులు చేస్తూ కనిపించారు. తాజాగా నిన్న కూడా ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. అనంతపురం జిల్లా రామినేని పల్లిలో పర్యటించిన సునీత అక్కడి రైతులతో కలిసి పొలంలో అడుగుపెట్టారు. ఆ సమయంలో అక్కడ వేరుశనగ విత్తనం వేస్తుండటాన్ని చూసిన ఆమె... రైతు బిడ్డ అవతారం ఎత్తారు. నడుముకు ఒడి కట్టుకున్న సునీత... ఆ ఒడిలో వేరుశనగ విత్తనాలు నింపుకుని విత్తన గొర్రు (ఎడ్ల సాయంతో విత్తనాన్ని విత్తే యంత్రం) వెంట నడిచి విత్తనం వేశారు.

  • Loading...

More Telugu News