: రజనీకాంత్ కు అనారోగ్యం!... అమెరికా ఆసుపత్రిలో చికిత్స!: మీడియాలో కథనాల వెల్లువ


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, అమెరికాలోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారన్న వార్తా కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రజనీ నటించిన ‘కబాలీ’ చిత్రం టీజర్ పెను సంచలనాలను సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ భారీ ఎత్తున నిర్వహించేందుకు చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను ఏర్పాట్లు చేసుకున్నారు. దీని కోసం రజనీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఉన్నపళంగా సదరు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన ధాను నుంచి... ఆడియో రిలీజ్ ను కేవలం ఆన్ లైన్ లో నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో విహార యాత్రకు వెళ్లిన రజనీ అనారోగ్యానికి గురయ్యారని, అక్కడి ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారన్న వార్తలు వెలువడ్డాయి. రజనీకి అనారోగ్యం కారణంగానే ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఆన్ లైన్ లో నిర్వహించేందుకు నిర్మాత సన్నద్ధమయ్యారని ఆ వార్తా కథనాలు చెబుతున్నాయి. అయితే రజనీకి అనారోగ్యమంటూ వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కూడా మరికొన్ని కథనాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News