: 'ఉడ్తా పంజాబ్'పై సెన్సార్ బోర్డును ప్రశ్నించిన బాంబే హైకోర్టు
పంజాబ్ డ్రగ్ మాఫియా ప్రధాన ఇతివృత్తంగా తీసిన 'ఉడ్తా పంజాబ్' వివాదంపై సెన్సార్ బోర్డు, సినిమా యూనిట్ లను బాంబే హైకోర్టు ప్రశ్నించింది. 'ఉడ్తా పంజాబ్' టైటిల్ మార్చమనడం ద్వారా పంజాబ్ డ్రగ్స్ కు మాత్రమే ప్రసిద్ధిగాంచిందని చెప్పాలనుకున్నారా? అని సెన్సార్ బోర్డును అడిగింది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎలక్షన్, పంజాబ్ వంటి పదాలు తొలగించాలని ఎందుకు అడిగారని సెన్సార్ బోర్డును ప్రశ్నించింది. అలాగే సినిమాలో సెన్సార్ బోర్డు సూచించిన 13 సూచనల పట్ల ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని పిటిషన్ వేసిన 'ఉడ్తా పంజాబ్' యూనిట్ ను వివరణ అడిగింది. రేపు ఈ వివరణలు వివరించాలంటూ ఈ కేసును రేపటికి వాయిదా వేసింది. కాగా, 'ఉడ్తా పంజాబ్' కు సెన్సార్ బోర్డు సుమారు 90 కట్ లు చెప్పింది. దీంతో నిర్మాతలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.