: ఢిల్లీలో బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు డిష్యుం డిష్యుం!
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశం సందర్భంగా బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు సంధించుకున్నారు. ఈ సందర్భంగా వ్యక్తిగత ఆరోపణలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అది చిలికిచిలికి గాలివానగా మారింది. దీంతో కౌన్సిలర్లు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు లంఘించి దాడులకు దిగారు. దీంతో పలువురు కౌన్సిలర్లకు గాయాలయ్యాయి. అనంతరం బీజేపీ కౌన్సిలర్లు తమను కొట్టారని, బయటి నుంచి వ్యక్తులను తీసుకువచ్చి మరీ తమపై దాడులకు దిగారని ఆమ్ ఆద్మీ కౌన్సిలర్లు ఆరోపించగా... ఆప్ కౌన్సిలర్లే తమపై దాడులకు దిగారంటూ బీజేపీ కౌన్సిలర్లు విమర్శించారు.