: నిద్రలేమితో బరువు పెరుగుతారు, జాగ్రత్త!: పరిశోధకుల హెచ్చరిక
తక్కువ సేపు నిద్రపోతున్నారా? అయితే మీరు బరువు పెరిగే ప్రమాదం అంచున ఉన్నారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ లో గల నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం నిద్రలేమి బరువు పెరిగేందుకు కారణమవుతోంది. ఆలస్యంగా, తక్కువ సమయమే నిద్రపోతూ, తక్కువ కూరగాయలు తింటూ, ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ లాగించేస్తూ, తక్కువ వ్యాయామం చేసేవారు బరువు పెరుగుతారని వారు వెల్లడించారు. ఈ పరిశోధనకు 96 మంది ఆరోగ్యవంతులైన 18 నుంచి 50 ఏళ్ల మధ్యనున్న వారిని ఎంచుకోవడం జరిగిందని పరిశోధకులు తెలిపారు. 6.5 గంటలు, ఆ పైన నిద్రపోయే వారి ఆరోగ్య స్థితిగతులపై పరిశోధనలు చేశామని వారు చెప్పారు. ఈ పరిశోధనల్లో తక్కువ నిద్రపోయిన వారిలో బరువు పెరుగుతున్నట్టు గుర్తించామని వారు వెల్లడించారు.