: రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు: ఎల్.రమణ విమర్శలు
తెలంగాణ రాష్ట్ర సమితి రెండేళ్ల పాలనపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శల జల్లు కురిపించారు. టీఆర్ఎస్ రెండేళ్ల పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఆయన అన్నారు. ప్రజా ప్రయోజనాలను కాపాడడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సచివాలయంలో ఎక్కడి ఫైళ్లు అక్కడే ఉన్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణకి కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా వాడట్లేదని ఆయన ఆరోపించారు. ఆదాయంలో మిగులును సాధించే రాష్ట్రాన్ని ఇప్పుడు అప్పుల తెలంగాణగా మార్చారని ఎల్.రమణ ఆరోపించారు. తెలంగాణ ఆదాయం, అప్పులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. కొత్త జిల్లాల పేరుతో రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.