: అమ్మకానికి సౌదీ రాకుమారుడి హోటల్... ఒక్కొ గది 5.42 కోట్లు


సౌదీ అరేబియా రాకుమారుడు అల్వలీద్ బిన్ తలాల్-అల్-సౌద్ హోటల్ అమ్మకానికి వచ్చింది. కెనడాలోని టోరంటోలోని యార్క్ విల్లీలోని రెండు భారీ భవనాల సముదాయమైన ఈ హోటల్‌ ను 2007లో సౌదీ రాకుమారుడి ఇన్వెస్ట్ మెంట్స్ కంపెనీ 'కింగ్ డమ్ హోల్డింగ్స్' 3.8 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత 2012లో హోటల్ లో పలు మార్పులు చేసి లగ్జరీ రూమ్ లను ప్రారంభించారు. ఈ హోటల్ లో మొత్తం 250 గదులు ఉన్నాయి. ఇంత పెద్ద ఫోర్ సీజన్స్ హోటల్‌ ను సౌదీ రాకుమారుడి కింగ్ డమ్ హోల్డింగ్స్ సంస్థ తాజాగా అమ్మకానికి పెట్టింది. ఈ హోటల్ లో ఒక్కో గది కొనుగోలు చేయాలంటే 5.42 కోట్ల రూపాయలు చెల్లించాలని ధరను నిర్ణయించింది. ఈ లెక్కన మొత్తం 1380 కోట్ల వరకు రావచ్చని అంచనా.

  • Loading...

More Telugu News