: జగన్ పత్రిక, ఛానెల్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది: మంత్రి యనమల
చట్టప్రకారం జగన్ పత్రిక, ఛానెల్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఒకట్రెండు రోజుల్లో ప్రారంభమవుతుందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అక్రమాస్తుల కేసులో అటాచ్డ్ సొత్తును స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం రూ.43 వేల కోట్ల అక్రమాస్తుల కేసులో జగన్ పై 11 చార్జిషీటుల నేపథ్యంలో సీబీఐ, ఈడీ లు జగతి పబ్లికేషన్స్ తో పాటు జగన్ కు చెందిన మరికొన్ని ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే.