: ఐదు నిమిషాల ఛార్జింగ్ తో 4 గంటలు మాట్లాడుకోవచ్చు!


కేవలం ఐదు నిమిషాల ఛార్జింగ్ తో నాలుగు గంటలపాటు మాట్లాడుకునే కొత్త రకం ఛార్జర్ ను చైనా కంపెనీ తయారు చేసింది. ఈ చార్జర్ వల్ల ఫోన్, బ్యాటరీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, పంప్ ఎక్స్ ప్రెస్ 3.0 పేరిట మార్కెట్ లోకి వచ్చే ఏడాది దీనిని విడుదల చేస్తామని మీడియాటెక్ కంపెనీ తెలిపింది. మార్కెట్ లో ఉన్న ఛార్జర్లకు పోటీగా దీనిని రంగంలోకి దింపినట్టు పేర్కొంది. దీనివల్ల బ్యాటరీ జీవిత కాలం తగ్గదని, స్మార్ట్ ఫోన్ హీటెక్కదని సదరు కంపెనీ తెలిపింది. ఈ ఛార్జర్ తో ఐదు నిమిషాలు ఛార్జింగ్ పెడితే 7 గంటలు మాట్లాడుకోవచ్చని, 20 నిమిషాలు ఛార్జింగ్ పెడితే 70 శాతం ఛార్జింగ్ అయిపోతుందని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News