: 12న సినీనటులు జమున, కైకాల సత్యనారాయణలకు 'మా' సన్మానం


సీనియర్ నటీనటులను సత్కరించుకునేందుకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ‘మా’ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్, జనరల్ సెక్రటరీ శివాజీ రాజా పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన జరిగే జనరల్ బాడీ సమావేశం (ఏజీఎం-2016)లో సీనియర్ నటీనటులైన జమున, కైకాల సత్యనారాయణ లను సత్కరిస్తున్నామన్నారు. నాటితరం హీరోయిన్ జమున ఎంతో సీనియర్ నటి అని, ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజ నటులతో కలిసి నటించిన నటుడు కైకాల సత్యనారాయణ అని.. వీళ్లిద్దరినీ ఏజీఎం-2016లో సన్మానించాలని తీర్మానించామన్నారు. ఈ సన్మానం దర్శకరత్న దాసరి నారాయణరావు చేతుల మీదుగా జరగనుందని చెప్పారు. ఈ వేడుకకు నటీనటులంతా హాజరుకానున్నారని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 9 గంటలకే సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఇదే పద్ధతిలో సీనియర్ నటీనటులను ఎంపిక చేసి ఏజీఎంలలో సన్మానాలు చేయాలని తమ కమిటీ నిర్ణయించిందని శివాజీ రాజా తెలిపారు.

  • Loading...

More Telugu News