: మూడు గంటలపాటు ఒక దేశానికి విద్యుత్ సరఫరాను ఆపేసిన 'కోతి' చేష్ట!
ఒక కోతి చేష్ట వల్ల ఒక దేశానికి మూడు గంటలపాటు విద్యుత్ లేకుండా పోయింది. ఈ ఘటన కెన్యాలో చోటుచేసుకుంది. మూడు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై ఆ దేశానికి 180 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసే 'ఎలక్ట్రిక్ కంపెనీ' నైరోబీలో వివరణ ఇచ్చింది. ఓ కోతి తమ కంపెనీకి చెందిన గిటార్ పవర్ స్టేషన్ పైకి ఎక్కిందని, అది అక్కడి నుంచి జారి ట్రాన్స్ ఫార్మర్ పై పడిందని, దీంతో పవర్ ట్రిప్ అయిందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. తద్వారా తమ సంస్థలో పనిచేయాల్సిన అన్ని మెషీన్లు ఆగిపోయాయని, దీంతో కెన్యాకు విద్యుత్ అంతరాయం కలిగిందని వారు తెలిపారు.