: తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యం, 10న బహిరంగ సభ: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు


తెలంగాణ‌లో జ‌రిగే త‌దుప‌రి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి, రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డా. ల‌క్ష్మ‌ణ్ అన్నారు. నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన న‌ల్గొండ జిల్లాలో త‌మ ప్ర‌చారానికి శ్రీ‌కారం చుడ‌తామ‌ని ఆయ‌న తెలిపారు. ఈనెల 10న న‌ల్గొండలో నిర్వ‌హించ‌నున్న బ‌హిరంగ‌ స‌భ‌లో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా పాల్గొంటారని ఆయ‌న పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అంకెల గార‌డీతో కాలం నెట్టుకొస్తోందని ల‌క్ష్మ‌ణ్ విమ‌ర్శించారు. ప్ర‌జా సంక్షేమానికి కేంద్రం 17 వేల కోట్ల రూపాయలు కేటాయించినా, రాష్ట్ర స‌ర్కార్‌ 6 వేల కోట్ల రూపాయలు మాత్ర‌మే ఖ‌ర్చు చేసిందని ఆయ‌న ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు పాలనలో విఫలమవుతున్నారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News