: హమ్మయ్య.. హనీమూన్‌కు సమయం దొరికింది!: రోహిత్ శర్మ
వరుసగా పలు క్రికెట్ టోర్నమెంట్లలో ఆడి బిజీ బిజీగా గడిపిన టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మకి ప్రస్తుతం కాస్త సమయం దొరికింది. గతేడాది డిసెంబరులో రోహిత్ ఓ ఇంటివాడయిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు హనీమూన్ వెళ్లడానికి సమయమే దొరకలేదు. ఇప్పుడు క్రికెట్ టోర్నమెంట్ల మధ్య కాస్త వ్యవధి ఉండడంతో ప్రస్తుతం రోహిత్ తన భార్యతో కలసి యూరప్ లో హనీమూన్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన తన భార్యతో కలసి యూరప్ లోని కాప్రిలో దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తనకు ఫైనల్‌గా హనీమూన్ వెళ్లడానికి సమయం దొరికిందని, తాము యూరప్ వెళ్లడానికి ప్రయాణించిన ఎతిహాద్ ఎయిర్ వేస్ విమానంలో అన్ని సదుపాయాలు ఉన్నాయని రోహిత్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. తాము రోమ్‌లో దిగామని అక్కడి కాప్రి లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయని ఆయన తెలిపాడు.