: సింగరేణి ఓపెన్ కాస్టులను రద్దు చేయాలి: ప్రొఫెసర్ కోదండరాం
సింగరేణి ఓపెన్ కాస్టు గనులను రద్దు చేయాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో టీ జేఏసీ ఆధ్వర్యంలో ‘రెండేళ్ల తెలంగాణ- ప్రజల ఆకాంక్షలు- తీరుతెన్నులు’ పై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న కోదండరాం మాట్లాడుతూ, మధ్య తరహా చెరువులను, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమమే టీ జేఏసీ ప్రధాన ఎజెండా అని, అన్ని ప్రాంతాల వికాసానికి జేఏసీ కృషి చేస్తోందని, ప్రజా సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, టీజేఏసీ రాజకీయ సంస్థ కాదని, ప్రజా సంస్థ అని కోదండరాం అన్నారు.