: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 232 పాయింట్లు లాభపడి 27,010 వద్ద ముగియగా, నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 8,266 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో ఎస్బీఐ సంస్థ షేర్లు అత్యధికంగా 5.66 శాతం లాభపడి రూ.210.15 వద్ద ముగిశాయి. వీటితోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెడ్ సిమెంట్, హిందాల్కో, అంబుజా సిమెంట్స్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్ సంస్థల షేర్లు అత్యధికంగా 1.91 శాతం నష్టపోయి రూ.975.30 వద్ద ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా పవర్, అరబిందో ఫార్మా, ఇన్ఫోసిస్ సంస్థల షేర్లు నష్టాలతో ముగిశాయి.