: సీఎం జయలలిత అక్రమాస్తుల కేసుపై ‘సుప్రీం’ తీర్పు రిజర్వ్


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ లో ఉంచింది. జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ అమితవ రాయ్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈమేరకు పేర్కొంది. ఈ నెల 10వ తేదీలోగా రాతపూర్వక సమాధానం ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం, ఇతర పిటిషన్ దారులను డివిజన్ బెంచ్ ఆదేశించింది. కాగా, జయలలిత అక్రమాస్తుల కేసు 18 ఏళ్ల పాటు విచారణ జరిగిన విషయం తెలిసిందే. ప్రత్యేక న్యాయస్థానం ఆమెను దోషిగా నిర్ధారించి నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా.. గత ఏడాది కర్ణాటక హైకోర్టు ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News