: కరెంట్ బిల్లు కట్టేందుకని వెళ్లి విద్యుత్ షాక్ తో మృతి
కరెంట్ బిల్లు కట్టేందుకని వెళ్లిన వ్యక్తి విద్యుత్ షాక్ తో ప్రాణాలు విడిచిన దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది. రాములు అనే వ్యక్తి కరెంట్ బిల్లు కట్టేందుకని 'మీ సేవా' కేంద్రానికి వెళ్లగా ఈ దారుణం జరిగింది. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు.