: ఆంధ్రావాళ్లు కూడా కోదండరాంను ఇంతగా అవమానించలేదు: రేవంత్ రెడ్డి
ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) చైర్మన్, ఉద్యమకారుడైన ప్రొఫెసర్ కోదండరాంకు ‘తెలంగాణ మంత్రులు ఇచ్చే గౌరవం ఇదేనా?’ అంటూ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కోదండరాంను ఆంధ్రావాళ్లు కూడా ఇంతగా అవమానించలేదని అన్నారు. కాగా, భూమిని నమ్ముకున్న రైతులపై తెలంగాణ సర్కార్ పడుతోందంటూ కోదండరాం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిధిలోని గ్రామస్తులతో భేటీ అయిన సందర్భంలో కోదండరాం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు.