: విందుకు వేళాయే!... చంద్రబాబుతో స్మృతి ఇరానీ, రాధాకృష్ణన్ భేటీ!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాధాకృష్ణన్ కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఎన్డీఏ సర్కారు పాలన రెడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా ‘వికాస్ పర్వ్’ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం నేడు విజయవాడలో జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాధాకృష్ణన్ కొద్దిసేపటి క్రితం బెజవాడలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. విజయవాడకు వచ్చిన వారిద్దరికీ చంద్రబాబు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ విందు సందర్భంగా చంద్రబాబు... ఏపీకి కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, ఆయా మంత్రిత్వ శాఖల నుంచి అందాల్సిన ప్రయోజనాలను ప్రస్తావించనున్నారు.