: కలెక్షన్ కింగ్ అంటే మోహన్ బాబు కాదు... మన చినబాబు: రోజా


"చంద్రబాబునాయుడు సంతకాలు పెడుతుంటే, మన లోకేష్ బాబు సూట్ కేసులు సర్దేస్తున్నారు. చంద్రబాబు డీల్ చేసి కాంట్రాక్టులు ఇస్తుంటే, ఆయన కొడుకు కమీషన్లను సెటిల్ చేస్తున్నారు. కలెక్షన్ కింగ్ అంటే అందరికీ మోహన్ బాబు గుర్తుకు వస్తారు. కానీ ఏపీలో అవినీతి సొమ్మును కలెక్ట్ చేయడంలో కలెక్షన్ కింగ్ అంటే లోకేష్ బాబే అందరికీ గుర్తుకు వస్తున్నారు" అని వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శల వర్షం కురిపించారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ చంద్రబాబు, లోకేష్ బాబు ఎక్కడ భూములు దొరికినా బినామీ బాబుల పేరిట దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతి అనకొండని, లోకేష్ బాబు కమీషన్ల కొండచిలువని అనకుండా ఉండలేకపోతున్నానని చెప్పారు. తనకున్నంత అనుభవం ఎవరికీ లేదని చెప్పుకునే ఆయన అవినీతిలో మాత్రం ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్నారని ఎద్దేవా చేశారు. అంత అనుభవం మరెవరికీ రాదన్నారు. డ్వాక్రా సంఘాల వెన్నెముక విరిచి కూర్చోబెట్టిన దౌర్భాగ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో డ్వాక్రా మహిళల వద్దకు ఓట్ల కోసం వెళితే, పేడ నీళ్ల సన్మానం తప్పదని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News