: నేరస్తుల వ్యాన్ లో రాజమండ్రికి ముద్రగడ... బలవంతంగా తరలింపు... అరెస్ట్ కాదట!
తనను అరెస్ట్ చేయాలని ఈ ఉదయం నుంచి అమలాపురం పోలీసు స్టేషన్ ఎదుట నిరసన చేపట్టిన కాపు వర్గం నేత ముద్రగడ పద్మనాభంను పోలీసులు బలవంతంగా సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఏ విధమైన అరెస్టులు చూపకుండానే నేరస్తులను తరలించే పోలీసు వ్యాన్ లోకి బలవంతంగా ఎక్కించి, ఆయన్ను రాజమహేంద్రవరం సీఐడీ కార్యాలయానికి తరలించారు. అమలాపురానికి వస్తున్న కాపుల సంఖ్య గంటగంటకూ పెరుగుతూ ఉండటం, అరెస్టులపై ముద్రగడ మెత్తబడక పోవడంతోనే, ఉద్రిక్తతను తగ్గించేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన్ను తామేమీ అరెస్ట్ చేయలేదని, గౌరవంగా సీఐడీ కార్యాలయానికి పంపామని, అరెస్ట్ చేసిన వారి వివరాలు, వారిపై ఉన్న సాక్షాలను ఆయనకు చూపిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి.