: దేశానికి మోదీ, రాష్ట్రానికి చంద్రబాబు: స్మృతి పొగడ్తలు


భారత దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఎంతగా కృషి చేస్తున్నారో, అంతే సమానంగా ఆంధ్రప్రదేశ్ ను ప్రగతి పథంలో నిలిపేందుకు చంద్రబాబునాయుడు శ్రమిస్తున్నారని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ పొగడ్తలు గుప్పించారు. ఈ ఉదయం విజయవాడకు వచ్చిన ఆమె, గుజరాతీ విద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. రాష్ట్రానికి దిశానిర్దేశం చేయగల సత్తా ఉన్న నేత చంద్రబాబు అని కొనియాడారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని వివరించారు. ప్రతి ఒక్కరూ చదువుకునేందుకు తామెన్నో పథకాలను అమలు చేస్తున్నామని, ముఖ్యంగా బాలికల విద్య పట్ల మరింత దృష్టిని పెట్టామని తెలిపారు.

  • Loading...

More Telugu News