: అంబులెన్సే కల్యాణమండపంగా ప్రేమ జంట వివాహం
ఆ ప్రేమజంటకు అంబులెన్సే కల్యాణ మండపంగా మారింది. దానిలోనే ఓ యువతి తాను ప్రేమించిన యువకుడితో మూడుముళ్లు వేయించుకుంది. ఈ సంఘటన తాజాగా కర్ణాటకలో చోటుచేసుకుంది. రెండు వారాల క్రితం యువతి నేత్రవతి తాను ఇష్టపడుతోన్న యువకుడితో చిత్రదుర్గ కోటకు వెళ్లింది. అయితే అనుకోకుండా కోటపై నుంచి ఒక్కసారిగా జారిపడ్డ నేత్రవతికి తీవ్రగాయాలయ్యాయి. ఆమె వెన్నుముక విరిగింది. అనంతరం వారం రోజులు బెంగళూరులో చికిత్స తీసుకుంది. ఇదిలా ఉంచితే, తాను ప్రేమించిన యువకుడు గురుస్వామిని అమావాస్య రోజున తలపెట్టిన సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే, ఇంతలోనే నేత్రవతికి ఈ ప్రమాదం జరగడంతో, చివరికి అంబులెన్స్‌లోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే ఆమె అంబులెన్స్‌లో ఉండగా గురుస్వామి ఆమెను పెళ్లి చేసుకున్నాడు.