: ఆరుగురి అరెస్ట్... రహస్య ప్రాంతంలో విచారణ: తుని ఘటనపై చినరాజప్ప
తునిలో జరిగిన రైలు దహనం, ఆపై స్టేషన్లలో విధ్వంసం వెనుక సూత్రధారులుగా భావిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశామని హోం మంత్రి చినరాజప్ప తెలిపారు. అమలాపురంలో అరెస్ట్ చేసిన కాపులను తక్షణం వదిలి పెట్టాలని, లేకుంటే తనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, ముద్రగడ పద్మనాభం నిరసనలు తెలియజేస్తుంటే, మీడియా ముందుకు వచ్చిన చినరాజప్ప వివరణ ఇచ్చారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారు అమాయకులు కాదని, రౌడీషీటర్లని ఆయన తెలిపారు. వీరందరినీ ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నామని, రైలు దహనం వెనకున్న అసలు నేరస్తులను బయటపెట్టడమే తమ ఉద్దేశమని వివరించారు. అమలాపురంలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని, కాపు సోదరులు సంయమనం పాటించాలని తెలిపారు.