: పోలీసుల అదుపులో హిల్లరీ క్లింటన్ మరిది!


అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాట్ల తరఫున బరిలోకి దిగనున్న హిల్లరీ క్లింటన్ మరిది, బిల్ క్లింటన్ తమ్ముడు రోగర్ క్లింటన్ మద్యం సేవించి వాహనం నడుపుతూ కాలిఫోర్నియా పోలీసులకు చిక్కారు. ఆపై రూ. 10 లక్షల విలువైన పూచీకత్తుపై ఆయన్ను విడుదల చేసి, కోర్టుముందు సెప్టెంబర్ 2న హాజరు కావాలని ఆదేశించారు. ఇదిలావుండగా, అరెస్టయిన రోగర్ క్లింటన్... మాజీ అధ్యక్షుడు బిల్ సోదరుడేనా? అన్న విషయాన్ని అధికారికంగా నిర్ధారించేందుకు పోలీసులు నిరాకరించారు. రోగర్ పై 1980 ప్రాంతంలో డ్రగ్స్ కేసొకటి నమోదు కాగా, బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్న వేళ, ఆ కేసు నుంచి విముక్తి లభించింది.

  • Loading...

More Telugu News