: కనిగిరిలో రికార్డింగ్ డ్యాన్సుల హోరు!... ఎమ్మెల్యే సమక్షంలో అమ్మాయిలతో కలిసి చిందేసిన మునిసిపల్ చైర్మన్
ప్రకాశం జిల్లా కనిగిరిలో నిన్న రికార్డింగ్ డ్యాన్సులు హోరెత్తాయి. ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన లేడీ డ్యాన్సర్లు అశ్లీల నృత్యాలతో హోరెత్తించగా, కనిగిరి జనం హుషారుగా వారితో కలిసి స్టెప్పులేశారు. ఈ తతంగమంతా కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కదిరి బాబూరావు సమక్షంలోనే జరగడం గమనార్హం. అమ్మాయిలు డ్యాన్సులు చేస్తుండగా... అక్కడికి సమీపంలోనే కదిరి బాబూరావు ఆసీనులవగా... అమ్మాయిలు చేయందించడంతో కదిరి మునిసిపల్ చైర్మన్ వారితో కలిసి చిందులేశారు. నిన్న రాత్రి జరిగిన ఈ రికార్డింగ్ డ్యాన్సులకు చెందిన వీడియో మీడియా చేతికి చిక్కింది. ఈ దృశ్యాలు ఓ తెలుగు టీవీ ఛానెల్ లో వరుసపెట్టి ప్రసారమవుతున్నాయి.