: ఆర్టీసీ ఉద్యోగులకూ ఐదు రోజు పని దినాలే!... బంపర్ ఆఫర్ ప్రకటించిన చంద్రబాబు
పూర్తి స్థాయి కార్యాలయాలు ఏర్పాటు కాకముందే నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి తరలివచ్చేందుకు ఉద్యోగుల నుంచి ఎదురవుతున్న నిరసనల నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వారికి బంపర్ ఆపర్లు ప్రకటిస్తున్నారు. అమరావతికి తరలివచ్చే సచివాలయ ఉద్యోగులకు 30 శాతం అదనపు హెచ్ఆర్ఏతో పాటు వారానికి ఐదు రోజుల పని దినాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇక నిన్న ఆర్టీసీ ఉద్యోగులకు కూడా చంద్రబాబు ఈ తరహా వరాలను ప్రకటించారు. నిన్న ఆర్టీసీ పరిపాలనా భవనాన్ని విజయవాడలో ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు... అమరావతికి తరలివచ్చే ఆర్టీసీ ఉద్యోగులకు సచివాలయ ఉద్యోగుల తరహాలోనే వారానికి ఐదు రోజుల పనిదినాలను వర్తింపజేస్తామన్నారు. అంతేకాకుండా ఆక్యూపెన్సీ రేషియో పెంచేందుకు ఉద్యోగులకు అన్ని విధాలుగా సహకరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.