: కోట్లు పెట్టి కొని, నన్నెందుకు పక్కన పెట్టారో?: క్రికెటర్ పవన్ నేగి
ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజనులో షేన్ వాట్సన్ తరువాత అత్యధిక ధర పలికిన ఆటగాడు పవన్ నేగి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం రూ. 8.5 కోట్ల భారీ మొత్తాన్ని పెట్టి నేగీని కొనుగోలు చేసి కూడా, 14 మ్యాచ్ లలో 8 మ్యాచ్ ల్లోనే ఆడించింది. దీనిపై పవన్ స్పందిస్తూ, తనను ఎందుకు రిజర్వ్ బెంచ్ లో కూర్చోబెట్టారో తెలియడం లేదన్నాడు. ఇందుకు ఫ్రాంచైజీ యాజమాన్యం కూడా ఎలాంటి కారణాలు చెప్పలేదని, గత సీజన్ లో చెన్నై జట్టుకు ఆడిన తనను ధోనీ ఎంతో ప్రోత్సహించాడని చెప్పుకొచ్చాడు. ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ తనకు బంతిని ఇవ్వలేదని, ఇవ్వమని తాను అడగలేదని వాపోయాడు. కాగా, ఈ సీజనులో జరిగిన 14 మ్యాచ్ లలో 8 మ్యాచ్ లు మాత్రమే ఆడిన నేగీ 9 ఓవర్లు వేసి, ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. బ్యాటింగులో 57 పరుగులు మాత్రమే చేశాడు.