: మలయాళ హీరోయిన్ ను కోర్టుకు ఈడుస్తామంటున్న నిర్మాతలు!


తమతో ఓ సినిమాకు ఒప్పుకుని, ఆపై షూటింగుకు రాకుండా ఇబ్బందులు పెడుతున్న హీరోయిన్ ఇషారాను కోర్టుకు ఈడుస్తామని 'ఎంగడా ఇరుందీగ ఇవ్వళువు నాళా' పేరిట మలయాళ చిత్రాన్ని నిర్మిస్తున్న జోసెఫ్ లారెన్స్ తెలిపాడు. ఇషారా, తమకు 20 రోజుల డేట్స్ ఇచ్చి అడ్వాన్స్ తీసుకుందని, ఆపై రెండు రోజుల షూటింగ్ తరువాత డుమ్మా కొట్టి చిత్ర యూనిట్ మొత్తాన్ని ఇబ్బంది పెడుతోందని తెలిపాడు. ఫిబ్రవరిలో ఆమెకు అడ్వాన్స్ ఇచ్చామని, ఆ తరువాత తను దుబాయ్ లో ఉన్నానని, వేరే షూటింగ్ ఉందని చెబుతూ తప్పించుకుందని, తదుపరి కథను మార్చారని విమర్శిస్తూ సాకులు చెప్పిందని తెలిపాడు. తాము పదేపదే సంప్రదించగా, వస్తున్నానంటూ చెప్పి ఏనాడూ షూటింగ్ కు రాలేదని వివరించాడు. విషయాన్ని కేరళ నడిగర సంఘం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ, ఆమె సరైన సమాధానం ఇవ్వలేదని, నిర్మాతల గిల్డ్ ఆమెను సంప్రదిస్తే మాట్లాడలేదని చెప్పాడు. కోర్టుకు వెళతామని చెబితే, బాధ్యతారాహిత్యంగా మాట్లాడిందని, ఆమెపై కేసును పెట్టనున్నామని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News