: కేంద్ర మంత్రి ఉమాభారతికి సీఎం చంద్రబాబు లేఖ
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అధికార పరిధిని ఆలస్యం చేయవద్దని ఆయన లేఖలో కోరినట్టు తెలుస్తోంది. బోర్డు అధికార పరిధి నోటిఫికేషన్ ను ప్రకటించవద్దని కేసీఆర్ కోరినట్లు తెలుస్తోందని, ఆయన చెబుతున్న అంశాలు విభజన చట్టాన్ని అనుసరించి లేవని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే అధికారాల ప్రకారమే ప్రాజెక్టుల నిర్వహణ ఉండాలని, సెక్షన్ 87(1) ప్రకారం వివిధ ప్రాజెక్టుల నుంచి నీటిని వినియోగించుకునే హక్కు ఉందని, తొమ్మిదో షెడ్యూల్ లోని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయాలను అమలు చేయకపోతే కేంద్రం చర్యలు తీసుకోవచ్చని ఆ లేఖలో చంద్రబాబు కోరారు.