: ఆర్మీ క్యాంపులో ఎకో-ఫ్రెండ్లీ మార్గంలో దోమల నివారణ


దోమల నివారణకు రసాయనాలతో కూడిన స్ప్రేలు, కాయిల్స్, లిక్విడ్స్ వంటివి వినియోగించడం ద్వారా మనుషులకే కాకుండా పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో అస్సాం తేజ్ పూర్ లోని ‘గజరాజు కార్ప్స్’కు చెందిన ఆర్మీ అధికారులు ఎకో-ఫ్రెండ్లీ విధానంలో దోమల నివారణకు చర్యలు తీసుకున్నారు. మిలిటరీ క్యాంపు ప్రాంతంలో నీరు ఉన్న ప్రదేశాల్లో దోమల లార్వాను తినేసే చేపలను వదిలారు. ఈ పద్ధతి ద్వారా దోమల నివారణకు, వాటి ద్వారా వచ్చే వ్యాధులకు చెక్ పెట్టొచ్చని అక్కడి అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News