: కోదండరామ్ కుబుసం విడిచిన పాము: బాల్క సుమన్
తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ పై టీఆర్ఎస్ నేతల మాటల దాడి కొనసాగుతోంది. తాజాగా టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్, కోదండరామ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కొదండరామ్ కుబుసం విడిచిన పాములాంటి వ్యక్తి అని విమర్శించారు. కొందడరామ్ కాంగ్రెస్ ఏజెంట్ లా పని చేస్తున్నాడని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఉంటే వరుసగా జరుగుతున్న ఉపఎన్నికల్లో అలాంటి ఘన విజయాలు వచ్చి ఉండేవి కాదని ఆయన చెప్పారు. ప్రపంచం మొత్తం కేసీఆర్ ను కీర్తిస్తుంటే ఆయన మాత్రం కేసీఆర్ ను విమర్శిస్తున్నారని అన్నారు.