: కోదండ రామ్ వెనుక ఎవ‌రు ఉన్నారో చెప్పాలి?: మ‌ంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి


ప్రొఫెస‌ర్‌ కోదండ రామ్ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేయడంపై తెలంగాణ మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం కేసీఆర్‌పై కోదండ రామ్ విమ‌ర్శ‌లు గుప్పించ‌డం స‌రికాద‌ని ఆయ‌న అన్నారు. కోటి ఎక‌రాల‌కు సాగునీరు అందించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. త‌మ ప్ర‌భుత్వం ఎన్నో ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంద‌ని, వాటిని మెచ్చుకోవాల్సింది పోయి, కోదండ రామ్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్‌ని కోదండ రామ్ గుడ్డిగా విమ‌ర్శించొద్ద‌ని ఆయ‌న సూచించారు. కోదండ రామ్ వెన‌క ఎవ‌రో ఉండి ఆయ‌న‌తో ఈ విమ‌ర్శ‌లు చేయిస్తున్నార‌ని, తన వెన‌క ఎవ‌రు ఉన్నారో కోదండ రామ్ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News