: జగన్ ఎందుకంతగా సంయమనం కోల్పోతున్నారో అర్ధం కావడం లేదు: డొక్కా
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎందుకంతగా సంయమనం కోల్పోతున్నారో తనకు అర్ధం కావడం లేదని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో ముఖ్యమంత్రిపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని సూచించారు. ఆయన వాడిన భాషను చూశాక తెలుగు భాషకు ఇది దుర్దినమని చెప్పవచ్చని అన్నారు. సంయమనంతో వేచి చూడాలని, రాజకీయాల్లో దుష్టసంప్రదాయాలు మంచివి కాదని ఆయన చెప్పారు. ప్రత్యర్ధులను విమర్శించేటప్పుడు భాషను అదుపులో పెట్టుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా జగన్ వైఖరిలో మార్పు రావాలని ఆయన సూచించారు.