: నా కళ్లను దానం చేయాలని నిర్ణయించుకున్నా: హీరోయిన్ కాజల్
ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన మరణానంతరం తన కళ్లను దానం చేయాలని నిర్ణయించుకుంది. కాజల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం.. ఆమె తాజా హిందీ చిత్రం ‘దో లఫ్జోంకీ కహానా’లో రణదీప్ హుడా సరసన ఆమె అంధురాలి పాత్ర పోషించింది. అంతేకాకుండా, పలువురు అంధులతో కలిసి కూడా నటించింది. ఈ పాత్ర తనలో మార్పు తీసుకువచ్చిందని, అందుకే, తన కళ్లను దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు కాజల్ తెలిపింది.