: రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేస్తున్న అరాచకవాది: జగన్ పై మంత్రులు కామినేని, పల్లె
తన 'రైతు భరోసా యాత్ర'తో ప్రశాంతంగా ఉన్న అనంతపురం జిల్లాలో అల్లర్లు సృష్టించిన అరాచకవాది జగన్ అని ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ్ రెడ్డిలు నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మార్చడమే జగన్ ముందున్న మొదటి లక్ష్యమని వారు దుయ్యబట్టారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన వారు, జగన్ కు మతిభ్రమించిందని, సైకోలా మాట్లాడుతున్నాడని, ప్రతిపక్ష నేతగా అనర్హుడని విమర్శించారు. తెలుగుదేశం కార్యకర్తలను జగన్ వర్గీయులు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని సూచించారు. జగన్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే రోజు త్వరలోనే వస్తుందని జోస్యం చెప్పారు.