: కోహ్లీ పేరెత్తగానే మీడియాపై యువరాజ్ రుసరుసలు!
ఓ చారిటీ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న యువరాజ్, మీడియా అడిగిన ప్రశ్నకు కోపగించుకుని వెళ్లిపోయాడు. కోహ్లీకి సంబంధించిన ఓ ప్రశ్న వేయగానే, యూవీ సహనాన్ని కోల్పోయి మీడియాపై రుసరుసలాడాడు. టెస్టులు, వన్డేలు, టీ-20 మ్యాచ్ లకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీకి ఎప్పుడు అవకాశం దగ్గరవుతుందని మీడియా అడుగగా, తాను క్రికెట్ గురించి మాట్లాడేందుకు రాలేదని కాస్త గట్టిగానే అన్నాడు. 'ఈ ఈవెంట్ గురించి మాత్రమే మాట్లాడటానికి వచ్చాను. ఓకే? కృతజ్ఞతలు' అంటూ, మరో ప్రశ్నకు తావివ్వకుండా వెళ్లిపోయాడు. ఈ కార్యక్రమంలో యూవీతో పాటు కోహ్లీ, ధోనీ, హార్దిక్ పాండ్యా తదితరులు హాజరై చిన్నారులతో ఫోటోలు దిగడంతో పాటు కాసేపు స్టెప్పులు కూడా వేశారు.