: దేశంలో తొలిసారిగా గౌరవ డాక్టరేట్ పొందిన ట్రాన్స్ జెండర్


దేశంలో తొలిసారిగా ఒక ట్రాన్స్ జెండర్ ను గౌరవ డాక్టరేట్ తో సన్మానించారు. ఇండియన్ వర్చువల్ యూనివర్శిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ (ఐవీయూపీ) సంస్థ నుంచి సామాజిక కార్యకర్త, ట్రాన్స్ జెండర్ అక్కై పద్మశాలి డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి మాట్లాడుతూ, తనకు డాక్టరేట్ వస్తుందని ఊహించలేదని, ఈ గౌరవం తనకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు డాక్టరేట్ ఇస్తున్నట్లు సంస్థ ప్రకటించినప్పుడు, పదో తరగతి ఫెయిలైన తనకు ఎలా ఇస్తున్నారనే అనుమానం వచ్చిందన్నారు. అయితే, సామాజిక కార్యకర్తగా ట్రాన్స్ జెండర్లకు సేవలందిస్తున్నందుకు గానూ డాక్టరేట్ ఇస్తున్నామని ఐవీయూపీ పేర్కొనడంతో తన డౌట్ క్లియర్ అయిందని ఆమె చెప్పారు. కాగా, ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న పద్మశాలి, అక్కడ తనలాంటి వారికి సేవలందిస్తోంది.

  • Loading...

More Telugu News