: అమీర్ ఖాన్ తో కలసి 30 సెకన్లు నటించినా చాలంటున్న సన్నీ లియోన్


హాట్ బ్యూటీ సన్నీ లియోన్ తన మనసులోని కోరికను బయటపెట్టింది. అమీర్ ఖాన్ తో కలిసి తెరపై కనిపిస్తే, అదే తన జీవితంలో అత్యంత మధురమైన ఘటనవుతుందని, అది ఎంత చిన్న పాత్రయినా సరేనని చెబుతోంది. "నేను అమీర్ ను ఓ సారి కలిశాను. అదో మధురమైన అనుభవం. ఆయనతో కలిసి నటించాలంటే ఎగిరి గంతేస్తాను. తమాషాగా చెప్పడం లేదు. కేవలం 30 సెకన్లయినా చాలు. ఆయనతో స్క్రీన్ పై కనిపిస్తే, మిగిలిన జీవితాంతం ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆనందిస్తా" అని చెప్పింది. సన్నీలియాన్ గత జీవితంపై మీడియా పదేపదే ప్రశ్నిస్తున్న వేళ, అమీర్ ఖాన్ ఆమెకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. సన్నీ లియోన్ తో కలసి పనిచేయడానికి తనకు అభ్యంతరం లేదని, ఆమె గతం గురించి తనకు ఎలాంటి సమస్యా లేదని వ్యాఖ్యానించినప్పటి నుంచి, ఈ మిస్టర్ పర్ ఫెక్షనిస్టుపై సన్నీ ఆశలు పెంచుకుంటున్నట్టు కనిపిస్తోంది. అన్నట్టు ఈ అమ్మడు ఇప్పుడు హిందీ తెగ మాట్లాడేస్తోంది. తన ఇరుగు, పొరుగు వారితో హిందీలో చాలా మాటలు మాట్లాడుతున్నాని, సినిమాలో డైలాగులను బట్టీ పడుతున్నానని చెప్పుకొచ్చింది సన్నీ.

  • Loading...

More Telugu News