: ప్రపంచానికి ఎన్నో వింతలు కనిపిస్తాయి: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు మౌలానా మసూద్ అజర్


ప్రపంచవ్యాప్తంగా ముస్లింలంతా కలిసే రోజు త్వరలోనే రానుందని ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మౌలానా మసూద్ అజర్ వ్యాఖ్యానించాడు. ఆన్ లైన్ పత్రిక 'అల్ ఖలామ్'లో ఓ వ్యాసం రాస్తూ, ముస్లింలపై పెరుగుతున్న ఒత్తిడి, వారందరినీ ఒకటి చేయనుందని, త్వరలో ఎన్నో వింతలను ప్రపంచం చూడనుందని అన్నాడు. కాందహార్ విమానం హైజాక్ ఘటన తరువాత, తనను పట్టిస్తే, భారీ ఎత్తున డబ్బిస్తామని భారత ప్రభుత్వం తాలిబాన్లకు ఆశ చూపిందని మసూద్ వెల్లడించాడు. నాటి ఘటనను ప్రస్తావిస్తూ, ప్రయాణికులను విడిపించగానే, తనను మళ్లీ పట్టించాలని అప్పటి తాలిబన్ మంత్రి ముల్లా అఖ్తర్ తో జస్వంత్ సింగ్ బేరం చేశాడని చెప్పాడు. తాలిబాన్లను నాశనం చేయడానికి అమెరికా, ఇరాన్ లు కారణమని ఆరోపించిన మసూద్, తమపై జరుగుతున్న దమనకాండకు వ్యతిరేకంగా తామంతా ఏకతాటిపైకి రానున్నట్టు ఆ వ్యాసంలో తెలిపాడు.

  • Loading...

More Telugu News