: హామీలు మరిచిన చంద్రబాబుకు త్వరలోనే శాస్తి తప్పదు!: వైసీపీ నేత పెద్దిరెడ్డి జోస్యం!


రైతు భరోసా యాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ అధినేత. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ఎక్కుపెట్టిన విమర్శల జడివానను ఆ పార్టీ నేతలు కొనసాగిస్తున్నారు. నిన్న జగన్ యాత్ర ముగియగా... కొద్దిసేపటి క్రితం చిత్తూరులో వైసీపీ కీలక నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన ఆయన... ఎన్నికల నాడు ఇచ్చిన హామీలను మరచిన చంద్రబాబుపై రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన చంద్రబాబుకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News