: కేటీఆర్ కు ఆ కారు బాగా నచ్చేసిందట!


తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీలో ఆయన పర్యటన పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ కారు ‘టెస్లా మోడల్ ఎక్స్’ లోనే సాగింది. తాజాగా మార్కెట్లోకి వచ్చిన ‘టెస్లా మోడల్ ఎక్స్’లోనే కేటీఆర్ తొలిరోజు నుంచి పర్యటిస్తున్నారు. విహంగం రెక్కల ఆకారంలో ఉన్న డోర్లు కలిగి ఉండటం, కేవలం నాలుగు సెకన్ల కన్నా తక్కువ సమయంలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలగడం వంటి ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి. కాగా, సిలికాన్ పర్యటనలో భాగంగా సంప్రదాయేతర ఇంధన వనరులపై ఆసక్తికర నూతన ఆవిష్కరణలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఐ-హబ్ లో ఒక స్టార్టప్ కంపెనీ రూపొందించిన బయో-డిగ్రేడబుల్ ప్లాస్టిక్ గ్లాస్ ఆకర్షించిందన్నారు. రెన్యువబల్ కంపెనీ కనుగొన్న నూతన టెక్నాలజీ సాయంతో తయారు చేసిన ఈ ప్లాస్టిక్ గ్లాసు వాడిపారేసిన ఆరు నెలల్లోనే మట్టిలో కలిసిపోతుందని, ఇటువంటి ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీని మన దేశంలోనూ ప్రవేశపెట్టాలని మంత్రి అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News